ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీల ఏర్పాటు
జిల్లాలో పెరిగిన అధికారుల జవాబుదారీతనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనాడూ తెలంగాణను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజల వద్దకు పరిపాలన చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ లాంటి అతిపెద్ద జిల్లాలను పునర్విభజించాలన్న ప్రజల డిమాండ్‌ను గత పాలకులు ఏనాడు పట్టించుకున్న పాపానపోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మక పరిపాలన సంస్కరణలు చేపట్టారు. 2016 అక్టోబర్‌లో దసరా పర్వదినం రోజున జిల్లాల పునర్విభజన అమల్లోకి వచ్చింది. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పడింది. ఇదే క్రమంలో అవసరమైన చోట, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు నూతన కలెక్టరేట్లను, పోలీస్ కమిషనరేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చింది.
కొత్త పరిపాలన విభాగాలు
యూనిట్ పాతవి కొత్తవి మొత్తం
జిల్లాలు 10 23 33
డివిజన్లు 43 31 74
మండలాలు 459 135 594
పోలీస్ కమిషనరేట్లు 02 07 09
సబ్ డివిజన్లు 139 25 164
సర్కిళ్లు 688 31 719
పోలీస్స్టేషన్లు 712 103 815
మున్సిపాలిటీలు 52 76 128
మున్సిపల్ కార్పొరేషన్లు 6 07 13
గ్రామ పంచాయతీలు 8,690 4,061 12,751
సమీకృత కలెక్టరేట్ భవనాలు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండేలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్ట డేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటితోపాటు అధికారుల నివాస సముదాయాలు కూడా నిర్మిస్తోంది. ఇప్పటికే 12 భవనాల నిర్మాణం పూర్తి కాగా, ఇందులో సిద్ది పేట, సిరిసిల్ల, కామారెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయాలను సిఎం కెసిఆర్ ఇటీవలే ప్రారంభించారు. నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు
ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు సగటున 35 లక్షల జనాభాతో దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉండేది. మారుమూల గ్రామాలకు జిల్లా కేంద్రం దాదాపు 100 నుంచి 200 కిలో మీటర్ల దూరంలో ఉండేది. దీంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా, జిల్లా అధికారులు గ్రామాలకు పోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొనేవారు. ఆనాడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడం, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ అధికారులకు ఎంతో కష్టమయ్యేది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చి, పాలనను ప్రజల వద్దకు చేర్చడానికి సిఎం కెసిఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారు. దీంతో ఇప్పుడు సగటున 70- నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీంతో గ్రామాలు, పట్టణాల్లో పరిపాలన ప్రజలకు అత్యంత చేరువయ్యింది. జిల్లా అధికారుల పర్యవేక్షణ పెరగడంతో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది.
కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సుపరిపాలన కోణంలో ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడేనాటికి 43 రెవెన్యూ డివిజన్లు ఉండగా ప్రస్తుతం 74కు పెంచింది. మొదట 28 నూతన డివిజన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొల్లాపూర్, కోరుట్ల, జోగిపేట, వేములవాడ, హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్లను అదనంగా ఏర్పాటు చేసింది. 2014 వరకు రాష్ట్రంలో 459 మండలాలు ఉండగా, కొత్తగా 135 మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 594కు పెరిగింది.
రెట్టింపైన మున్సిపాలిటీలు
రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం పట్టణ స్వభావం కలిగిన పెద్దగ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. కొన్నిరాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం పట్టణ స్వభావం కలిగిన పెద్దగ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చింది. కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్డేట్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్లు మాత్రమే ఉండగా, ప్రభుత్వం మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 128కి, కార్పొరేషన్ల సంఖ్య 13కు పెరిగింది. మొత్తం పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 141కు చేరింది. మరో వైపు పట్టణ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసింది. ఇలా మొత్తం 322 గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి.
మా తండా మా రాజ్యం
‘మా తండాలో మా రాజ్యం’ కావాలంటూ గిరిజనులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అయినా గత ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి 4,383 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసింది. దాంతో రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 12,751కి చేరింది. అనేక గూడెంలు, తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ‘మా తండాలో మా రాజ్యం’ కల సాకారం అయ్యింది. స్థానిక ప్రభుత్వాలు కొలువుదీరాయి. ప్రతినెలా పంచాయతీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తోంది. దీంతో గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. గ్రామపంచాయతీలకు ఏటా రూ.8 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.40 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మాట తప్పకుండా నిధులను విడుదల చేస్తోంది.
పంచాయతీలకు ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో అనుసంధానం
నూతన మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టిపెట్టింది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు ఇతర గ్రామాలు, మండల కేంద్రాలతో అను సంధానాన్ని పెంచేందుకు రూ.5 వేల కోట్లతో రోడ్డు పనులు చేపట్టింది. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లను నిర్మిస్తోంది. రూ.2,655 కోట్లతో 139 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపటింది. ఇందులో ఇప్పటివరకు 1,616 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి కగా మరో 232 కిలోమీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి.