- Advertisement -
బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర సర్కార్ హామీ
ముంబయి: మూడురోజులముందు నోటీస్ ఇవ్వకుండా ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను అరెస్ట్ చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు హామీ ఇచ్చింది. తనను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని గురువారం బాంబే హైకోర్టులో వాంఖడే పిటిషన్ వేశారు. దానిపై విచారించిన హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ హామీ ఇచ్చారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో తాను లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కోసం మహారాష్ట్ర పోలీసులు నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టును వాంఖడే కోరారు. ఆర్యన్‌ఖాన్‌కు కేసు నుంచి విముక్తి కల్పించడం కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్టు వాంఖడేపై ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -