- Advertisement -
పేరు మార్పును ప్రకటించిన కంపెనీ సిఇఒ జుకర్‌బర్గ్
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ ఇకపై ‘ఫేస్‌బుక్’గా కనిపించదు. ఇకపై ఇది కొత్త పేరు ‘మెటా’(Meta)గా కనిపించనుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు ‘మెటా’గా మారిందని కంపెనీ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్ పేరు మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టుగానే కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఈ కొత్త పేరును ప్రకటించారు. ‘సంస్థ చేసే ప్రతి పనిని కలిగి ఉండే కొత్త కంపెనీ బ్రాండ్‌ను స్వీకరించడానికి ఇది సమయం. ఇప్పుడు మనం ఫేస్‌బుక్ కాదు మెటావర్స్‌గా మారబోతున్నాం’ అని జుకర్‌బర్గ్ అన్నారు. మెటావర్స్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి వచ్చే ఐదేళ్లలో 10,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. కంపెనీ భవిష్యత్తు ‘మెటావర్స్’లో ఉందని అన్నారు.
- Advertisement -