Friday, November 22, 2024

మంత్రి కెటిఆర్‌కు అనసూయ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Anasuya Bharadwaj Tweets to Minister KTR

హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో స్కూల్స్ తిరిగి ప్రారంభమైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిల్లలు స్కూల్‌కు వచ్చే విషయమై వారిని బలవంతం చేయవద్దని సూచించినా కొన్ని పాఠశాలల తీరు మారడం లేదు. ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సినీ నటి, యాంకర్ అనసూయ.. మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ కెటిఆర్‌కు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాలన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్.. ఇదెక్కడి న్యాయం? మీరు ఈ విషయంలో సమీక్షిస్తారని భావిస్తున్నాను అని అనసూయ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News