న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 549 మంది మృతిచెందినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42కోట్లకు పైగా చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,57,740మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, గత 24 గంటల్లో 13,543మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,36కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,61,555 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 106 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ తెలిపింది.కాగా, తాజా కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు నమోదయ్యాయని, ఈ ఒక్క రాష్ట్రంలోనే 471మంది బాధితులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
India reports 14313 new cases in 24 hours