Friday, November 15, 2024

ఇంతలో… ఎంత మార్పు…

- Advertisement -
- Advertisement -

MD Sajjanar Solving problems in TSRTC

ఆర్‌టిసిలో నెల కొన్న సమస్యలను పరిష్కరిస్తున్న
ఎండి సజ్జన్నార్
హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది, ప్రయాణికులు
త్వరలో లాభాల పడుతుంది
దీమా వ్యక్తం చేస్తున్న సిబ్బంది

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆర్‌టిసిలో రెండు నెలల క్రితం వరకు సిబ్బంది వేతనాల కోసం ఆందోళనలు, ధర్నాలు చేయాల్సి వచ్చేది. దీంతో సిబ్బందిలో చేసే ఉద్యోగం పట్ల నిర్లిప్తత… ఉద్యోగం చేస్తున్నా సమయానికి వేతనాలు రాక పోవడంతో వారి ఆర్దిక బాధలు వర్ణనాతీతం.. అంతే కాకుండా ప్రయాణికుల్లో కూడా ఆర్టిసిలో ప్రయాణం పట్ల అనేక సందేహాలు, అనుమానాలు.. దీంతో వారు అతి పెద్ద రెండో ప్రైవేట్ రవాణ వ్యవస్థ అయినా ఆటోలు,క్యాబ్‌లను ఆశ్రయించి జేబులకు చిల్లుపెట్టుకోవాల్సి వచ్చేది.. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగర నడిబొడ్డుకు రావాల్సినా, అదే విధంగా వారి నివాస ప్రాంతాల వెళ్ళాల్సి వచ్చినా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేంది. కరోనా ప్రభావం తగ్గడంతో పూర్తి స్థాయిలో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అనేక ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీలకు వెళ్ళాల్సిన విద్యార్థులకు బస్సులు అందుబాటులో లేక పోవడంతో వారు సొంత వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో వారు ప్రమాదాల బారిన కూడా పడుతుండేవారు.

బస్టాపుల్లో బస్సులు వివరాల కనిపించేవి కాదు.. దాంతో స్థానికంగా ఉండే ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు.. సమయ పాలన పాటించని ఆపినా..ఆగని బస్సులు ఈ విధంగా ఎక్కడ చూసినా సంస్థలో ఏ ఒక్క వర్గాన్ని కదిపినా తీవ్ర అసంతృప్తి… కాని అదంతా…. గతం .. ఆర్‌టిసి ఎండిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి సంస్థ రూపు రేఖలు పూర్తిగా మారుతూ వచ్చాయి.. బ్యాంక్ సిబ్బందితో మాట్లాడిన ఎండి సజ్జన్నార్ సిబ్బందికి గతంలో మాదిరిగా వేతనాలను సమయాకి వచ్చేలా చేశారు.. దీంతో సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుండటమే కాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు తమ వంతు భాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక వైపు ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించడమే కాకుండా ప్రయాణికుల సమస్యలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు.

దానిలో భాగంగా కొద్ది రోజుల క్రితం లక్డికాపూల్ నుంచి ఎంజిబిఎస్ సాధారణ ప్రయాణికునిమాదిరిగా టికెట్ తీసుకుని వారి సాదక బాదలను దగ్గర నుంచి గమనించారు. మరో సారి అంతర్జాతీయ విమాశ్రయ నుంచి వచ్చే ప్రయాణికులతో కలిసి పుష్పక్ ఏసీ బస్సులో ప్రయాణించి సంస్థ అభివృద్దికి తీసుకోవాల్సిన సలహాలు,సూచనాలను స్వీకరించారు. ప్రయాణికులు సమస్యలను దగ్గ నుంచి తెలసుకున్న ఆయన బస్టాపుల్లో వారు పడుతున్న ఇబ్బందులను గమనించి బస్టాపుల్లో ఆయా మార్గల్లో ప్రయాణించే బస్సులు వివరాలను కూడా ఏర్పాట్లు చేశారు. శివారు ప్రాంతాల ప్రయాణికులు, విద్యార్థుల సమస్యల మీద దృషి సారించిన ఎండి ఆయా ప్రాంతాలకు అదనపు ట్రిప్పులు, అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను కూడా పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలపై దృష్టి సారించిన సంస్థల్లో నెలకొన్న ఒకొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు కెళుతున్నారు.దీంతో సంస్థ గతంలో మాదిరిగా పూర్వవైభోగం సంతరించుకుని లాభాలబాట పడుతుందని సిబ్బంది దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌టిసి అభివృద్దికి
ఆర్‌టిసి ఎండి చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాం
టిజెఎంయు రాష్ట్ర కార్యదర్శి హనుమంతు ముదిరాజ్

ఆర్‌టిసి అభివృద్దికి సంస్థ ఎండి హర్నిషలు చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నామని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టిజెఎంయు) రాష్ట్ర కారర్శి హనుమంతు ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పూచీకత్త లేకుండా ఒక్క రోజు కూడా రుణం తీసుకోలేదని, కానీ ఎండి సజ్జన్నార్ ప్రభుత్వ పూచీకత్తు లేకుండా రూ.300 కోట్లు ఆర్‌టిసికి బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు రావడం ఆయన చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. తన దైన శైలిలో సంస్థను లాభాల బాట పట్టే దిశగా ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, స్వయంగా డిపోలను, ఆసుపత్రులను, సందర్శిస్తూ వాటిని ఏ విధంగా అభివృద్ది చేస్తో బాగుంటుందో ఆ విధంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సిబ్బంది పొదుపు చేసుకున్న సిసిఎస్ డబ్బులను యాజమాన్యం వాడుకోవడతో ఇప్పుడు వచ్చే రూ.300 కోట్లను సిసిఎస్‌కు ఇస్తామని చెప్పడంతో 50 శాతం సమస్యలు పరిష్కారం అవుతాయని దాంతో సిబ్బందికి కొంత మనోధైర్యం వస్తుందన్నారు. ఆర్‌టిసి సిబ్బందికి చెందిన పేస్కేల్స్, 5 డిఏలను 2013కు సంబంధించిన 50 శాతం ఏరియర్స్‌ను బాండ్ డబ్బులున ఇప్పంచాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News