Saturday, November 23, 2024

తొలిసారి బహిరంగంగా కనిపించిన తాలిబన్ అధినేత!

- Advertisement -
- Advertisement -

Akhundjada Taliban Chief

కాబూల్: తాలిబన్ అధినేత హైబతుల్లా అఖుంద్జాదా తొలిసారి బహిరంగంగా కనిపించినట్లు ఆదివారం తాలిబన్ అధికారులు ప్రకటించారు. అఖుంద్జాదా దక్షిణ అఫ్ఘానిస్థాన్ నగరమైన కాందహార్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన తర్వాత అక్కడి అధికారులు ఈ ప్రకటన చేశారు. ఆయన 2016 నుంచి ఇస్లామీయ ఉద్యమానికి ఆధ్యాత్మిక అధినేతగా ఉన్నప్పటికీ తెరవెనుకే ఉండిపోయారు. ఆయన తాలిబన్ గ్రూపు ఆగస్టులో అఫ్ఘానిస్థాన్‌ను కైవసం చేసుకునప్పటికీ బయటికి కనిపించలేదు. కొత్త తాలిబన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటికీ ఆయన తగ్గి ఉండిపోవడంతో అనేక ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. చివరికి ఆయన చనిపోయాడని కూడా వదంతులు వ్యాపించాయి.

అఖుంద్జాదా శనివారం అఫ్ఘానిస్థాన్‌లోని దారుల్ ఉలూమ్ మదర్సాను సందర్శించి ప్రసంగించారు. ‘ఆయన తన ధీరోదాత్తులైన సైనికులు, శిష్యులతో మాట్లాడారు’అని తాలిబన్ అధికారులు తెలిపారు. ఆ ఈవెంట్ సందర్భంగా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండడం వల్ల ఎలాంటి ఫోటోలు, వీడియోలు వెలుగుచూడలేదు. కాకపోతే తాలిబన్ సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన ప్రసంగానికి సంబంధించిన 10 నిమిషాల ఆడియో రికార్డింగ్ మాత్రం పోస్టయింది.

అఖుంద్జాదాను ‘అమీరుల్ మోమీన్’ అని పిలుస్తుంటారు. అంటే దైవసందేశాన్ని ఇచ్చే విశ్వసనీయ కమాండర్ అని అర్థం. ఆయన తన ప్రసంగంలో రాజకీయాలను అసలు ప్రస్తావించలేదు. కానీ తాలిబన్ నాయకత్వానికి దేవుడి ఆశీసులు కోరుకున్నారు. ఆయన తాలిబన్ అమరవీరులు, గాయపడిన వీరుల కోసం ప్రార్థించారు. ఈ గొప్ప పరీక్షలో ఇస్లామీయ ఎమిరేట్స్ అధికారులు విజయం సాధించాలని కూడా ప్రార్థించారు. తాలిబన్‌కు ఇదివరకు చీఫ్‌గా ఉన్న ముల్లా అఖ్తర్ మన్సూర్ 2016లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించాక సాదాసీదాగా జరిగిన అధికార మార్పుతో తాలిబన్ నాయకుడిగా అఖుంద్జాదా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News