Saturday, November 23, 2024

పండుగలతో కరోనాకు రెక్కలు

- Advertisement -
- Advertisement -

Wings to the Covid-19 with festivities

గుంపులుగా దీపావళి షాపింగ్
జనసందోహంగా మారిన మాల్స్, వస్త్ర దుకాణాలు
కోవిడ్ నిబంధనలు పాటించని షాపులు యాజమానులు
నిర్లక్ష్యం చేస్తే వైరస్ ముప్పు తప్పందంటున్న వైద్యులు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశముందని వైద్యనిపుణులు గత వారం రోజుల హెచ్చరిస్తూ వ్యాక్సిన్ అందరు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. కానీ నగర ప్రజలు దీపావళి పండుగ సంబరాలు కోసం మాల్స్, వస్త్రదుకాణాలు, పండ్ల మార్కెట్లలో గుంపులుగా సంచరిస్తున్నారు. కనీసం ముఖానికి మాస్కులు ధరించే వారు కనిపించడం లేదు. ఇష్టానుసారంగా కస్టమర్లు వస్తున్న షాపులు యాజమానులు ఏమాత్రం పట్టించుకోకుండా క్రయ, విక్రయాల్లో మునిగిపోయారు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ కూడా జనం తీసుకొచ్చే బ్యాగులు తనిఖీలు చేయడం తప్ప మాస్కులు, ధరించడం, భౌతికదూరం వంటి చూడటం లేదు. రెండు రోజులుగా వైద్యశాఖ అధికారులు పలు దుకాణాలను పరిశీలన చేయగా, కోవిడ్ నిబంధనల ఊసేలేదని, శానిటైజర్ కూడా వాడటం లేదని వాపోతున్నారు.

వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన పట్టించుకునే నాథుడే లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే సీజన్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులు రద్దీగా మారాయని, మళ్లీ వైరస్ రెచ్చిపోతే థర్డ్‌వేవ్‌ను అపడం ఎవరి తరంకాదంటున్నారు. మహమ్మారి విరుగుడు మాస్కులు, శానిటైజర్, భౌతికదూరమేనని, వీటిని ప్రజలు నిర్లక్షం చేస్తే కరోనా కాటు బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా టీకా మొదటి డోసు వారిలో 30శాతం మంది సెకండ్ డోసు తీసుకోలేదని, వారంతా రేపటి నుంచి ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని వెళ్లి తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. గత రెండు నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు 55 నుంచి 65 వరకు పాజిటివ్ నమోదైతున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి పండుగలు ఉండటంతో నగరంలోని దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, అబిడ్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, తార్నాక, వనస్దలిపురం ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలతో పాటు, కిరాణం, బంగారం షాపులు జన సందోహంగా మారాయి.

విద్యాసంస్దలు కూడా చిన్నారుల పట్ల నిర్లక్షం వహిస్తున్నారని, తరగతులు విభజన చేయకుండా ఒకే దగ్గర విద్యార్ధులను చేర్చి ఒక తరగతికి 50మందికి పైగా చిన్నారులు కూర్చోబెడుతున్నారు. దీపావళి పండగతో పాటు సంక్రాంతి ముగిసే వరకు నగర ప్రజలు ముఖానికి మాస్కులు, బౌతికదూరం తప్పకుండా పాటించాలని, జీహెచ్‌ఎంసీ అధికారులు షాపులను తనిఖీ చేసి కోవిడ్ నిబంధనలు పాటించని యాజమానులపై జరిమానాలు విధించాలని వైద్యులు కోరుతున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరిగే వారు కూడా మాస్కులు ధరించకుండా త్రీబుల్ రైడింగ్ చేస్తూ బౌతికదూరం పాటించని వారిపై జరిమానాలు విధించాలని ట్రాఫిక్ పోలీసులను జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News