హైదరాబాద్ : టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగే కీలక మ్యాచ్కు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది. ఇరు జట్లు కూడా తమ తమ మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు సెమీస్కు చేరడం చాలా కష్టమనే చెప్పాలి. కీలక మ్యాచ్లో న్యూజిలాండ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
భారత్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్