డానియెల్ నెగర్స్‌తో మరిచిపోలేని భేటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : అధికారిక పర్యటన మీద ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌కు విదేశీ గడ్డపై ఒక ఆత్మీయ అతిథి తారసపడ్డారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష మీద పరిశోధన చేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ఓరియెంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్‘లో దక్షిణ ఆసియా హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నెగర్స్ గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాష పై చేస్తున్న పరిశోధన గురించి ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు వివరించారు. వేల మైళ్ళ దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం అని మంత్రి కెటిఆర్ ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్‌ను ప్రశంసించారు.