Monday, November 18, 2024

బిసి గురుకులాలపై మంత్రి గంగుల సమీక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, బిసి సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సంద్య, ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బిసి గురుకులాల్లోని వసతులు, కరోనా సంరక్షణ చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్టళ్లు, బోజనశాలలతో పాటు క్లాస్ రూంలలో తగిన ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా గురుకులాలను నిర్వహిస్తున్నామన్నారు ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు మంత్రికి తెలిపారు.

ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విధంగా ప్రతీ కమ్యూనిటీ నుండి ఏక సంఘంగా ఏర్పడిన వారికి వెంటనే ఆత్మగౌరవ భవన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలు సైతం వారికే అప్పగించాలని మంత్రి గంగుల సూచించారు. మిగతా సంఘాలతో సైతం నవంబర్ 8న సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటికే కోకాపేట, ఉప్పల్ బగాయత్, బాటసింగారంలలో 40 కులాలకు, 82.30 ఎకరాలను దాదాపు 100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో  త్వరలోనే అత్యంత వేగంగా వీటిని పూర్తి చేయడానికి బిసి సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తుందని ప్రిన్సిపల్ పల్ సెక్రటరీ బుర్రావెంకటేశం మంత్రికి వివరించారు.

Gangula Kamalakar review on BC Gurukul Schools

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News