Saturday, November 23, 2024

ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ: ఐక్యరాజ్యసమితి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ

హైదరాబాద్: వ్యవసాయ – విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా నవంబర్ 4, 5, 2021 తేదీలలో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై “అంతర్జాతీయ విత్తన సదస్సు” నిర్వహించనున్న ఎఫ్ఎఒ రోమ్ తెలిపింది.

ఈ సందర్భంగా “ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ యాజ్ ఎ గ్లోబల్ సీడ్ హబ్” అనే అంశంపై ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్ఎఒ ఆహ్వానం పంపింది. ప్రభుత్వం తరపున విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు ప్రసంగించనున్నారు. దీంతో   అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం ఇది.  దాదాపు 195 ప్రపంచ దేశాలకు చెందిన మంత్రులు, ఎఫ్ఎఒ ప్రతినిధులు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తన ఖ్యాతి అంతర్జాతీయ బాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలలొ ప్రసారం చేయనున్నారు.

అంతర్జాతీయ విత్తన భాండాగారంగా గుర్తింపు పొందిన తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న మౌలిక వసతులు, అవకాశాలు, విత్తన పరిశ్రమ సామర్థ్యం, విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యాక్రమాలపై వివరణాత్మక ప్రసంగించనున్నారు.  తెలంగాణ రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దికి విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగానా నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థను ఎండి కేశవులును రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News