Friday, November 15, 2024

ఎమ్మెల్సీ వేటలో గ్రేటర్ గులాబీ నేతలు

- Advertisement -
- Advertisement -

దక్కించుకునేందుకు పార్టీ పెద్దలతో మంతనాలు
మహానగరం నుంచి 12మంది వరకు ఆశావాహులు
గతంలో హామీ పొందిన నేతల్లో చిగురిస్తున్న ఆశలు
ఉద్యమకారులకే ప్రాధాన్యత ఇవ్వాలంటున్న పార్టీ సీనియర్లు

TRS Party leaders wait for MLC

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగడంతో ఆశావాహులు దక్కించుకునేందుకు పైరవీలకు తెర లేపారు. ఆరు స్ధానాలు ఖాళీగా ఉండటంతో ఏలాగైనా ఆసారి వరిణించేలా శ్రమిస్తూ పార్టీ పెద్దలను కలుస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. అదే విధంగా గతంలో పలు సందర్బాల్లో సిఎం కెసిఆర్ హామీ ఇవ్వడంతో వారంతా మండలిలో అడుగు పెట్టేలా చూడాలని కోరుతున్నారు. మూడు రోజుల కితం ఎన్నికల నోటికేషన్ రావడం ఈనెల 29న ఎన్నికల నిర్వహణ, అదే రోజుల ఫలితాలు వెలువడుతాయి.

దీంతో గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలోనే ఎక్కువమంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు టిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ సలీం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కట్టెల శ్రీనివాస్‌యాదవ్, పిఎల్ శ్రీనివాస్, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బండి రమేష్ ఉండగా, రంగారెడ్డి నుంచి క్యామ మల్లేష్,రాగం సుజాత నాగేందర్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, రాంమోహన్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి, నాగేందర్‌గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుచరులు వెల్లడిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని గుర్తించి, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడంతో అక్కడ ఉండి పార్టీకి సేవలందించిన వారే వచ్చే ఎన్నికల్లో సీటు రాదని, మండలికి పంపాలని జిల్లా మంత్రులకు సూచిస్తున్నారు.

గ్రేటర్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక పార్టీ పెద్దలకు సవాల్‌గా మారింది. 10 నుంచి 12మంది వరకు పోటీ పడుతున్నారు. మరోపక్క పార్టీ నమ్ముకుని మొదటి నుంచి పనిచేసిన నాయకులు వలస నాయకులు ప్రాధాన్యత ఇవ్వవద్దని, ఉద్యమకారులకు పెద్ద పీఠ వేయాలంటున్నారు. పార్టీలు మారేవారిపట్ల టిఆర్‌ఎస్ పెద్దలు జాగ్రత్తలు వహించాలని పేర్కొంటున్నారు. పార్టీ కోసం పనిచేసే నిజమైన నాయకులకు పార్టీలో నామినేట్ పదవులు అప్పగించాలని కోరుతున్నారు.వీరితో పాటు ఓయూకు విద్యార్ధి నాయకులు కూడా ఎమ్మెల్సీ చోటు కల్పించాలని, పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News