Friday, September 20, 2024

‘ఆచార్య’ నుండి రెండో సాంగ్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. చిరు సరసన రెండోసారి కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చరణ్, పూజాపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ అనే పాటను నవంబర్ 5న ఉదయం 11.07గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్నాడు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Acharya 2nd single Neelambari releasing on Nov 5th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News