కాలిఫోర్నియా: ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్ ‘ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం’(ముఖాన్ని గుర్తించి తెరుచుకునే విధానం)ను మూసేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఫేసియల్ రికగ్నిషన్ సిస్టంతో యూజర్ ఫోటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా గుర్తించే సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడంపై సామాజికంగా ఆందోళన దృష్ట్యా ఆ విధానంను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
ఫేస్బుక్లో కృతిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం ఉపాధ్యక్షుడు అయిన జెరోమ్ పెసెంటీ ‘ఇంకా క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ విషయాన్ని ప్రాసెస్ చేసే పనిలో ఉన్నాం. కొనసాగుతున్న అనిశ్చితి నడుమ కొన్ని సమంజసమైన కేసుల్లోనే ఫేస్ రికగ్నిషన్ సిస్టంను ఉపయోగించేంత స్థాయికి తీసుకెళతామని భావిస్తున్నాం’ అని బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ఇదిలావుండగా ఫేస్బుక్ కంపెనీ గత వారం తన పేరును మెటా ఫ్లాట్‌ఫామ్స్ ఇన్కార్పొరేషన్గా మారుకుంది.
ఫేస్బుక్ యూజర్లలో మూడింట ఒక వంతు మంది ఫేస్బుక్ రికగ్నిషన్‌ను ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పు వంద కోట్లకుపైగా యూజర్ల ‘ఫేసియల్ రికగ్నిషన్ టెంప్లేట్’ను డిలీట్ చేయనుంది. ఇలా తొలగించడం అన్నది డిసెంబర్ నాటకి పూర్తికానున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు.