కట్మాండు: తమ దేశంలోని మిగులు విద్యుత్‌ను నేపాల్ మొట్టమొదటిసారి భారత్‌కు విక్రయించనున్నది. భారతీయ విద్యుత్ మార్పిడి మార్కెట్‌లో తన మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు నేపాల్‌కు ఇటీవలే భారత ప్రభుత్వం అనుమతించింది. తన మిగులు విద్యుత్‌ను విక్రమించే పరిస్థితిలో నేపాల్ విద్యుత్ సంస్థ(ఎన్‌ఇఎ) ఉండడంతో దీన్ని భారత్‌లో పోటీ ధరలకు విక్రయించేందుకు అనుమతి కోసం నేపాల్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసి భారత్ విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి గత సోమవారం అనుమతి పొందినట్లు కట్మాండు పోస్ట్ పత్రిక బుధవారం తెలిపింది. మొదటి దశలో ఎన్‌ఇఎకి చెందిన త్రిశూల్ హైడ్రోపవర్ ఉత్పత్తి చేసిన 24 మెగావాట్ల విద్యుత్‌తోసహా 30 మెగావాట్ల విద్యుత్, దేవీఘాట్ పవర్ హౌస్ ఉత్పత్తి చేసిన 15 మెగావాట్ల విద్యుత్‌ను భారత్‌లో నేపాల్ విక్రయించనున్నది. ఈ రెండు ప్రాజెక్టులు భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించినవే కావడం విశేషం.