Friday, November 22, 2024

డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

- Advertisement -
- Advertisement -

Central teams to 9 states with high dengue cases

న్యూఢిల్లీ: డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాలను పంపింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రాలకు ఈ బృందాలు తమ తోడ్పాటు అందించనున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. బృందాలను పంపిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, పంజాబ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఈ నెల 1న ఢిల్లీలో డెంగ్యూ తీవ్రతపై ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవ్య సమీక్షించారు. దేశంలో మొత్తం 1,16,991 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. అక్టోబర్ 31వరకు 15 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 86 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను కేంద్ర బృందాలు సమీక్షించి, అవసరమైన సలహాలిస్తాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News