న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలుకావడంపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెంటార్ ధోని సలహా మేరకే కివీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించామని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రకటించడాన్ని గంభీర్ తప్పుపట్టాడు. ధోనితో కలిసి తాను సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాడని అతను ఎప్పుడూ కూడా ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోడని గంభీర్ స్పష్టం చేశాడు. కొత్తగా కెరీర్ ఆరంభించిన ఆటగాళ్లకు పలు అవకాశాలు ఇచ్చిన ఘనత ధోనికి మాత్రమే దక్కుతుందన్నాడు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ధోరణి ఉందన్నాడు. కోహ్లి ప్రతి మ్యాచ్‌లో ప్రయోగాలకు దిగుతూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడని గంభీర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇక వరల్డ్‌కప్ వైఫల్యాలకు కోహ్లిదే పూర్తి బాధ్యత అని, దీనిలో ధోని పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని గంభీర్ స్పష్టం చేశాడు.