Tuesday, November 5, 2024

30 తర్వాత ఉచిత రేషన్ కట్!?

- Advertisement -
- Advertisement -

free ration
న్యూఢిల్లీ: ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పిఎంజికెఎవై) కింద ఇస్తున్న ఫ్రీ రేషన్ పంపిణీని నవంబర్ 30 తర్వాత విస్తరించే ప్రతిపాదన ఏదీ లేదని ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే శుక్రవారం తెలిపారు. ఆర్థికవ్యవస్థ పుంజుకున్నందున, ఓపెన్ మార్కెట్‌లో ఆహారధాన్యాలు విరివిగా లభిస్తున్నందున పిఎంజికెఎవైను విస్తరించే ప్రతిపాదన ఏదీ లేదని కూడా ఆయన తెలిపారు. కోవిడ్-19 కారణంగా నెలకొన్న ఒత్తిడి దృష్టా 2020 మార్చిన పిఎంజికెఎవైను ప్రకటించారు. ఈ స్కీమ్‌ను 2020 ఏప్రిల్-జూన్‌లో ఆరంభించారు. ఆ తర్వాత దానిని నవంబర్ 30 వరకు పొడగించారు. పిఎంజికెఎలవై కింద ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందిస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద ఈ ఉచిత రేషన్‌కు 80 కోట్ల రేషన్ కార్డుదారులను గుర్తించామని పాండే విలేకరులకు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సబ్సిడీ ధాన్యానికి మించి ఈ ఉచిత రేషన్ ధానం ఇవ్వడం జరిగిందన్నారు. దీనిని విస్తరించే ప్రతిపాదనలేదన్నారు.
“ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోంది. ఈ ఏడాది ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్‌ఎస్) కింద మార్కెట్‌లో ధాన్యం బాగానే లభిస్తోంది. కనుక పిఎంజికెఎవై కింద ఫ్రీ రేషన్‌ను నవంబర్ 30 తర్వాత విస్తరించే ప్రతిపాదన లేదు” అని సుధాంశు పాండే తెలిపారు. దేశీయ మార్కెట్‌లో ఆహారధాన్యాలు విరివిగా లభించేందుకు, ధరల నియంత్రణకు ప్రభుత్వం ఓఎంఎస్‌ఎస్ పాలసీ కింద బియ్యం, గోధుమలను ఇస్తోంది.

Sudhanshi Pandey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News