Tuesday, November 5, 2024

టిఆర్‌ఎస్ పేదల పార్టీ

- Advertisement -
- Advertisement -
Minister koppula eshwar slams bjp leader
బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలి
కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నారు
ప్రైవేట్‌లో బడుగులకు రిజర్వేషన్లు లభిస్తాయా?
బిజెపి నాయకులను నిలదీసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ, హైదరాబాద్: టిఆర్‌ఎస్ పేదల కోసం పనిచేస్తోందని.. దేశవ్యాప్తంగా బిజెపి ఎవరి కోసం పనిచేస్తుందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. శుక్రవారం టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసుకుంటూ పోతున్నారు. ప్రైవేటుపరం అయితే బడుగువర్గాలకు రిజర్వేషన్లు లభిస్తాయా? అని నిలదీశారు. దమ్ముంటే.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి చూపించాలని భాజపాకు సవాల్ విసిరారు. ప్రజల కోసం పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బిజెపి బురదజల్లుతోందని మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దళిత బంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.దళితబంధు కెసిఆర్ ఆలోచనతో రాష్ట్రంలో మొదలైన పథకం.. ఎన్నికల సమయంలో బిజెపి ఫిర్యాదుతో ఆగింది.

దమ్ముంటే బండి సంజయ్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితబంధు లాంటి పథకం పెట్టించాలని సవాల్ విసిరారు.దేశవ్యాప్తంగా 32 ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బిజెపి గెలిచింది.కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు తో గెలిచిన రాజేందర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. హుజురాబాద్‌లో మా ఓటమికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఆ పార్టీ ఎవరికి కొమ్ము కాస్తుందో చెప్పాలన్నారు. ఉన్నత వర్గాల కోసం, అదానీ, అంబానీల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News