Saturday, November 23, 2024

మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా

- Advertisement -
- Advertisement -

China launches three more remote sensing satellites

 

బీజింగ్ : చైనా శనివారం మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనా లోని సిచౌన్ ప్రావిన్స్ జిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించింది. యోగాన్ 35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను లాంగ్ మార్చ్ 2 డి రాకెట్ విజయవంతంగా తీసుకెళ్లినట్టు చైనా అధికారిక మీడియా పేర్కొంది. లాంగ్‌మార్చ్ సీరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396 వి మిషన్‌గా తెలిపింది. 2019 మార్చిలో లాంగ్ మార్చి 3 బీ రాకెట్ విజయవంతంగా నింగి లోకి దూసుకెళ్లింది.చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300 వ ప్రయోగంగా అది నిలిచినట్టు పేర్కొంది. లాంగ్ మార్చ్ వాహక రాకెట్ సిరీస్‌ను చైనా ఎయిరో స్పేస్ అండ్ టెక్నాజలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో ఈ రాకెట్ల ద్వారానే 96.4 శాతం పూర్తి చేయటం గమనార్హం. తొలి వంద ప్రయోగాలకు 37 ఏళ్లు పట్టగా, తదుపరి వందకు 7.5 ఏళ్లు, ఆ తర్వాత నాలుగేళ్ల లోనే మరో వంద ప్రయోగాలను చైనా చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News