- Advertisement -
అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెజ్జోనిపేటలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో యువతి చదువుతోంది. ఆమెకు తోటి విద్యార్థి సుహృద్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె పలుమార్లు తిరస్కరించింది. అతడు మాత్రం పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో అతడిపై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -