- Advertisement -
చండీగఢ్: పెట్రోల్, డీజిల్ పై పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. గత కొన్ని రోజులుగా చమురు ధరలను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం డీజిల్ పై రూ.7, పెట్రోల్ పై రూ.5లు తగ్గించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చమురు ధరలపై వ్యాట్ తగ్గించాలని కోరింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వల్పంగా వ్యాట్ ను తగ్గించాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఈ ధరలు ఈరోజు అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ స్పష్టం చేశారు.
Punjab Govt Reduces Fuel Prices
- Advertisement -