Friday, November 22, 2024

ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు

- Advertisement -
- Advertisement -

జలుబు, దగ్గు, జ్వరంతో ఆరోగ్య కేంద్రాలకు
చలి తీవ్రతో సీజనల్ వ్యాధుల విజృంభణ
రోజుకు 30నుంచి 40 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు

Corona free tests begin again
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో గత వారం రోజుల నుంచి చలి తీవ్రత, వాతావరణంలో మార్పులతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలతో బాధపడుతూ వైరస్ ముప్ప వస్తుందని త్వరగా వ్యాధులను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టుల కోసం ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 250మందికిపైగా రోగులు వస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. దీనికి తోడు బస్తీలు, కాలనీల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు విస్తరించి రాత్రింబళ్లు తేడా లేకుంటా కాటు వేయడంతో చాలామంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాదులకు గురైతూ చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు బాట పడుతున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ముందుగా టెస్టులు నిర్వహించి వ్యాధులను నిర్దారించి కావాల్సిన చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ వస్తే వెంటనే గాందీ, టిమ్స్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

రోజుకు 30 నుంచి 40మంది పరీక్షల కోసం వస్తున్నట్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పేర్కొంటున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండి రోగులకు పలు రకాల సేవలందిస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో 226 బస్తీదవఖానలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఐదారు రోజుల నుంచి వైద్యంకోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగిందంటున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని కేంద్రాలు సిబ్బంది చెబుతున్నారు.

ఈఏడాది వర్షాలు విస్తరంగా కురువడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉందని,దీంతో జలుబు, దగ్గు,జ్వరం, మలేరియా, టైపాయిడ్ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని జిల్లా వైద్యశాఖ పేర్కొంటున్నారు.దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వచ్చే రెండు రోజుల పాటు వరుసగా పండగలు ఉండటంతో కరోనా ఉనికిచాటే అవకాశముందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ఇప్పటికి రోజు 52 నుంచి 60వరకు పాజిటివ్ కేసులు నమోదైతున్నట్లు, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News