Saturday, November 23, 2024

దేశంలో ఎవై .4.2 వేరియంట్ ప్రభావం లేదు: ఇన్సాకాగ్

- Advertisement -
- Advertisement -

AY.4.2 Variant Not Of Concern In India

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వైరస్‌కు సంబంధించి ఎవై .4.2 వేరియంట్ ప్రభావం లేదని, వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం ( ఇన్సాకాగ్ ) వెల్లడించింది. ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే కేవలం 0.1 శాతం కంటే తక్కువగానే ఉన్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్ మాత్రమే ఆందోళనకర వేరియంట్‌గా కొనసాగుతోందని తెలిపింది. ఇవి కాకుండా దేశంలో కొత్తగా ఎటువంటి వేరియంట్‌లు వెలుగు చూడలేదని స్పష్టం చేసింది. కొవిడ్ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ఏవై 4.2 వేరియంట్ రూపంలో వ్యాప్తి చెందుతున్నట్టు అనేక నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి. బారత్ లోనూ ఇప్పటివరకు దాదాపు 17 నమూనాల్లో ఎవై 4.2 వేరియంట్‌ను గుర్తించారు. అయితే ఇది ప్రాణాంతకం కాదని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News