Friday, November 22, 2024

అప్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం

- Advertisement -
- Advertisement -
New Zealand's win over Afghanistan
కీలక మ్యాచ్‌లో అఫ్గాన్‌పై విజయంతో సెమీస్‌కు చేరిన కివీస్
 టీమిండియా ఇక ఇంటికే

అబూధాబి: టి20 ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్ కోసం ఆశగా ఎదు రు చూసిన భారత జట్టు ఆశలు ఆడియాసలయ్యాయి. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించాలని అభిమానులు చేసిన పూజ లు నిష్ఫలమయ్యాయి. అబూధాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగినకీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ దర్జాగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. అఫ్గాన్ నిర్దేశించిన 125 పరుగుల విజయ లక్షాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా న్యూజిలాండ్ విజయంలో భారత్, అఫ్గాన్ జట్లు రెండూ టోర్నమెట్‌నుంచి నిష్కరమించాయి. దీంతో సోమవారం నమీబియాతో భారత్ పోరు నామమాత్రమైంది. టి20 ప్రపంచకప్ పోరులో సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అన్ని రంగాల్లోను అద్భుతంగా రాణించి అఫ్గాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ను 124 పరుగులకే కట్టడి చేసిన కివీస్ ఆ తర్వాత కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్షాన్ని ఛేదించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 నాటౌట్), కాన్వే(36 నాటౌట్), మార్టిన్ గుఫ్తిల్(28), మిచెల్(17) రాణించడంతో స్వల్ప లక్షాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. దీంతో గ్రూప్‌బిలో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. గ్రూపులో పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ముజీబ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మహమ్మద్ షహజాద్(4), హజ్రతుల్లా జజాయ్(2)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ గుర్బాజ్(6) కూడా విఫలమయ్యారు. అనంతరం వచ్చిన నయీబ్‌తో కలిసి నజీబుల్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కుదురుకుంటున్న సమయంలో నయీబ్(15)ను సోధీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ నబీ(14)దూకుడుగా ఆడకపోయినా నజీబుల్లాకు చక్కటి సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్ మరోసారి కష్టాల్లో పడింది.

ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 115 పరుగులతో ఉన్న అఫ్గాన్‌ను కివీస్ బౌలర్లు చావుదెబ్బతీశారు. నబీ, నజీబుల్లా, కరీం(2)లను వెంటవెంటనే పెవిలియన్‌కు చేర్చారు.దీంతో అఫ్గాన్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ ఒక్కడే 73 పరుగులు చేశాడు. నజీబుల్లా ఆదుకోకపోయి ఉంటే అఫ్గాన్ ఈ మాత్రం స్కోరయినా చేసి ఉండేది కాదు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కివీస్ బౌలర్ల ఒత్తిడి ఎక్కువైనా అద్భుతంగా రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సౌథీ 2, మిల్నే, సోధీ, నీషమ్‌లు తలా ఓ వికెట్ తీశారు. అద్భుతంగా బౌల్ చేసి అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీసిన బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News