Monday, November 25, 2024

రైతుల కన్నా ఎక్కువ ఆత్మహత్యలు వ్యాపారులదే!

- Advertisement -
- Advertisement -

sucides
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్న వ్యాపారుల సంఖ్య 2020లో 50 శాతం పెరిగింది. ఈ పెరుగుదల 2019 అంకెలతో పోల్చినది. స్థూలంగా చూసినట్లయితే 2020లో రైతుల కన్నా వ్యాపారులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) తాజా డేటా ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో 10677 ఆత్మహత్యలు నమోదు అవ్వగా, 2020లో 11716 ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 11000 ఆత్మహత్యలను పరిశీలించినప్పుడు 4356 మంది వ్యాపారులు(ట్రేడ్స్‌మెన్) కాగా, 4226 మంది విక్రేతలు(వెండార్స్), మిగతా వారిని ఇతర వ్యాపారుల కేటగిరిలో చేర్చారు. వ్యాపారవర్గం వారి ఆత్మహత్యలు 2019లో 2906 కాగా, 2020లో అది 4356కు పెరిగింది. అంటే 49.90శాతం పెరిగింది. ఇదిలావుండగా 2020లో దేశవ్యాప్తంగా మొత్తంగా ఆత్మహత్యల సంఖ్య 10 శాతం పెరిగి 1,53,052కు చేరుకుంది. దేశంలో ఇదే ఇదివరకెన్నడూ లేనంత ఎక్కువ ఆత్మహత్యలని చెప్పుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News