వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన అమర జవాన్ ర్యాడ మహేష్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆ గ్రామంలో జవాన్ విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమర జవాన్ ర్యాడా మహేష్ కుటుంబానికి ఇస్తున్న 50 లక్షల ఆర్థిక సహాయం (మహేష్ తల్లి పేరున 25 లక్షలు,భార్య పేరున 25 లక్షలు), జవాన్ భార్య సుహాసిని కి జాబ్, జవాన్ తల్లి 300 గజాల ప్లాట్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశ రక్షణలో ఆయన చేసిన సేవలను, పొందిన వీర మరణాన్ని స్మరించుకోవడం జరిగింది.
- Advertisement -