Friday, November 22, 2024

షోయబ్ అక్తర్‌పై రూ. 100 మిలియన్లకు పరువునష్టం దావా

- Advertisement -
- Advertisement -

Shoaib Akhtar
ఇస్లామాబాద్: గత నెలలో జరిగిన ఓ టివి చర్చా కార్యక్రమంలో మాజీ పేసర్ షోయబ్ అక్తర్ , ఆ టివిషో హోస్ట్ నోమన్ నియాజ్‌తో వాగ్వాదం చేసి అర్ధంతరంగా వెళ్లిపోయాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పిటివి అక్తర్‌పై రూ. 100 మిలియన్లకు పరువు నష్టం దావా వేసింది.
టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై పాక్ విజయం తర్వాత పిటివిలో విశ్లేషణ జరిగింది. ఒక సందర్భంలో హోస్ట్ నియాజ్ ‘మీరు కొంచెం మొరటుగా మాట్లాడుతున్నారు. మరీ అంత ఓవర్‌స్కార్ట్‌నెస్ పనికిరాదు. మీరిక దయచేయవచ్చు” అన్నారు. దానికి నొచ్చుకున్న అక్తర్ పిటివిలో క్రికెట్ విశ్లేషణ ఉద్యోగానికి అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోయాడు. అయితే చర్చ జరుగుతుండగా లైవ్‌లో రాజీనామా చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, రాజీనామా కారణంగా ఛానల్‌కు నష్టం కలిగిందని పేర్కొంటూ తాజాగా పిటివి అక్తర్‌కు పరువు నష్టం నోటీసులు పంపింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే టి20 ప్రపంచకప్ కోసం దుబాయ్ వెళ్లిపోయాడని ఆరోపించింది. భారత క్రికెటర్ హర్భజన్‌తో కలిసి ‘ఇండియన్ టివి’లో కనిపించాడని, ఇది పిటివికి దెబ్బ అని కూడా పేర్కొంది. జరిగిన నష్టానికి రూ. 100 మిలియన్లు చెల్లించాలని, అలాగే, మూడు నెలల వేతనంతో సమానమైన రూ.33,33,000 కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ నోటీసలు అందుకున్న అక్తర్ పిటివిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన గౌరవమర్యాదలను కాపాడులేకపోయిన పిటివి ఇప్పుడు నోటీసులు పంపిందని ట్వీట్ చేశాడు. తర్వాత ఏమి చేయాలన్నది తన లాయర్ చూసుకుంటారని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News