మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో మద్యం దుకాణాల సంఖ్య 2,216 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 2,620కి పెంచింది. డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించింది. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల కేటాయించినట్లు తెలిపిన ఎక్సైజ్ శాఖ ఓపెన్ కేటగిరీ కింద 1,864 లిక్కర్ దుకాణాలు మిగిలాయని వెల్లడించింది. నేటి నుంచి ఈనెల 18వరకు దరఖాస్తులను స్వీకరించి ఈనెల 20న డ్రా ద్వారా షాపులను ఎక్సైజ్‌శాఖ కేటాయించనుంది. గత రెండేళ్లల్లో మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా ఎక్సైజ్‌శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్షలో ఇటీవల చర్చించారు. అమ్మకాలు ఎక్కువ ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా కొత్తగా 404 మద్యం దుకాణాలను అదనంగా పెంచారు.
TS Govt increased 404 New Wine Shops