Sunday, November 24, 2024

అఫ్ఘాన్‌పై భారత నేతృత్వంలో సమావేశం

- Advertisement -
- Advertisement -

NSA meet on Afghanistan
న్యూఢిల్లీ: ‘అఫ్ఘానిస్థాన్ ఇరుగుపొరగు దేశాల ప్రాంతీయ సమావేశం’ను భారత్ న్యూఢిల్లీలో రేపు(బుధవారం) నిర్వహించబోతున్నది. ఈ సమావేశానికి హాజరుకమ్మని పాకిస్థాన్, చైనాలకు ఆహ్వానం పంపినప్పటికీ ఆ రెండు దేశాలు ఈ సమావేశానికి డుమ్మా కొడుతున్నాయి. ‘షెడ్యూలింగ్ సమస్యల’ కారణంగా హాజరుకాలేకపోతున్నానని చైనా తెలుపగా, ‘భారత్’కారణంగానే హాజరు కావడంలేదు అంటూ పాకిస్థాన్ తెలిపింది. ఆ రెండు దేశాల కారణాలను భారత్ కలిపి చూడ్డంలేదు. పాకిస్థాన్‌కు సెన్సిటివ్ ఇష్యూ అయినందునే చైనా కూడా హాజరుకాలేకపోతుందని భావిస్తోంది. ఒకరోజుపాటు జరిగే ఈ సమావేశంలో ఆగస్టులో అధికారాన్ని తాలిబన్లు సాధీనం చేసుకున్నాక కలిగిన భద్రతా మార్పులు, అనిశ్చితి వంటి విషయాలపై దృష్టి పెట్టబోతున్నది. ఈ సమావేశానికి ఇరాన్, రష్యా కజకిస్థాన్,కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్థాన్, తుర్కెమెనిస్థాన్,ఉజ్బెకిస్థాన్ దేశాలు హాజరవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News