మద్యం షాపులకు రిజర్వేషన్లు
ఈనెల 18 వరకు కొత్త మద్యం షాపు టెండర్లకు దరఖాస్తులు
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో కొత్తగా మూడు మద్యం షాపులు పెరిగాయి. ఈ కార్యాలయం పరిధిలో మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), వలిగొండ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో గతంలో 12 మద్యం షాపులు ఉండగా అదనంగా మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లో (అరూర్ వద్ద) ఒక్కొక్కటి చొప్పున మూడు కొత్త షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 15 షాపులకు చేరాయి. 2021, 2023 సంవత్సరానికి గాను మద్యం షాపులకు ప్రభుత్వం నూతన పాలసీని విడుదల చేసింది. మద్యం షాపులను కులాలవారీగా రిజర్వేషన్లు అమలు చేస్తుంది. దీంతో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వ్ చేయబడిన వైన్‌షాపులు వారికే దక్కనున్నాయి. మోత్కూరులో 1వ షాపు (గౌడ్), 2, 3వ షాపు (ఓపెన్ ఫర్ ఆల్), 4వ షాపు (ఎస్సీ), అడ్డగూడూరులో 1వ షాపు (గౌడ్), 2వ షాపు ఓపెన్ ఫర్ ఆల్), గుండాలలో 1, 2వ షాపులు (ఓపెన్ ఫర్ ఆల్), ఆత్మకూరు(ఎం)లో 1వ షాపు (గౌడ్), 2వ షాపు (ఓపెన్ ఫర్ ఆల్), వలిగొండలో 1, 2, 4వ షాపులు (ఓపెన్ ఫర్ ఆల్), 3వ షాపు (గౌడ్), 5వ షాపు అరూర్ (ఓపెన్ ఫర్ ఆల్) రిజర్వ్ చేయబడ్డాయి. నవంబర్ నెలాఖరుతో వైన్‌షాపుల లైసెన్స్‌లు ముగుస్తుండటంతో డిసెంబర్ 1 నుంచి వైన్స్‌షాపుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 9 నుంచి దరఖాస్తులను ఆహ్వానించిందని, 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది అని, 20న డ్రా తీస్తారని మోత్కూరు ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు.