Saturday, November 16, 2024

యాసంగికి 20.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు

- Advertisement -
- Advertisement -

రైతుల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయ్యండి
కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ

20.5 lakh metric tonnes of fertilizer

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం రూపొందించిన రసాయనిక ఎరువుల ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి యాసంగి పంటల సాగుకు అవసరమైన ఎరువుల ప్రణాళికపై కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి పంటల సాగుకు అనుగుణంగా తెలంగాణ రా్రష్ట్రానికి వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర మంత్రి మాండవీయను లేఖ ద్వారా కోరినట్టు తెలిపారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాలన్నారు.

యాసంగి పంటల సీజన్‌కు సంబంధించి రాష్ట్రానికి 20.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించిన కేంద్రం వీటిని అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలని కోరినట్టు తెలిపారు. నెలవారీగా రాష్ట్ర అవసరాలకు కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విన్నవించిందన్నారు. అక్టోబర్ , నవంబర్ మాసాలకు సంబంధించి 6.4లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేంద్ర ప్రభుత్వం కేవలం 3.67లక్షల టన్నుల ఎరువులు మాత్రమే కేటాయించిందని తెలిపారు. యాసంగికి కేటాయించిన ఎరువుల కోటాలో కూడా కేంద్రం ఇప్పటివరకూ 1.55లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేసిన ఎరువుల కేటాయింపు ప్రకారమే 2.12లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రాష్ట్రానికి రావాల్సి వుందన్నారు. ఇతర దేశాలనుంచి దిగుమతి అయిన వెసెల్స్ నుండి రాష్ట్రానికి ఎరువులను కేటాయించాలని కోరామన్నారు. గంగవరం పోర్టులోని ఐపిఎల్ కంపెనీకి చెందిన వెసెల్ నుండి 23వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరపరా చేయాలని కోరినట్టు తెలిపారు. క్రిబ్‌కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్‌ల యూరియాను కేటాయించాలన్నారు. అక్టోబర్ , నవరంబర్ నెలల్లో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చిలోపు సరఫరాచేసి రాష్ట్రకోటాను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. పంట సాగు అవసారాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి వెంటవెంటనే ఎరవులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు లేఖరాసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News