మన తెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఏమైనా చర్చించాల్సి ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించాలని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. బయట మీడియాతో మాట్లాడి పార్టీ పరువును దిగజార్చొద్దని సూచించారు. రేవంత్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా నియామకానికి ముందు అభిప్రాయ సేకరణ నిర్వహించి, 80 శాతానికి పైగా ఆయనను కోరుకోవడంతోనే అధిష్టానం నియమించిందని వివరించారు. రేవంత్‌రెడ్డి టిపిసిసి చీఫ్‌గా నియమితులైన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించామని మల్లు రవి తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెసకు తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదేదో మాట్లాడారని, మాజీ ఎంఎల్‌సి ప్రేమ్‌సారగ్ కూడా అల్టిమేటం జారీ చేశారన్నారు. ఇవన్నీ పార్టీని దిగజార్చేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరిపై గౌరవం వుందని, ఎలాంటి వ్యతిరేక భావం లేదని స్పష్టం చేశారు. పార్టీకి విధేయులైనప్పుడు.. టిపిసిసితో చర్చిండం లేదా పార్టీ సమావేశాల్లో లేవనెత్తడం చేయాలన్నారు. అంతేకానీ సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు.
Leaders to talk inside of Congress party meetings: Mallu Ravi