Saturday, November 23, 2024

మెగాస్టార్ అభిమానిగా ‘రాజా విక్రమార్క’తో హ్యాపీగా అనిపించింది

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ ‘గ్యాంగ్ లీడర్’లో స్టైలిష్ విలన్‌గా నటించి మెప్పించారు. ’చావు కబురు చల్లగా’ వంటి వైవిధ్యమైన సినిమా చేశారు. ’రాజా విక్రమార్క’లో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయతో ఇంటర్వ్యూ…

‘రాజా విక్రమార్క’లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
నేను ఇప్పటివరకు ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్టైలిష్‌గా ఉంటుంది.ఎన్‌ఐఏ ఏజెంట్‌గా డ్రెస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా ఇది. ఈ సినిమా రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో పాటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగంగానే ఉంటాయి.
ఎన్‌ఐఏ ఏజెంట్ రోల్ కోసం ఎలా సిద్ధమయ్యారు?
ఎన్‌ఐఏ ఏజెంట్ అంటే… బోర్డర్‌లో జరిగే కథ కాదు. దేశం లోపల జరిగే కథ. దర్శకుడితో కూర్చొని నా పాత్ర గురించి చర్చించాను. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ… అన్నీ ఎలా ఉండాలనేది మాట్లాడాను. గన్ ఎలా పట్టుకోవాలి? వంటి విషయాలను తెలుసుకున్నాను.
చిరంజీవి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ ఈ చిత్రానికి పెట్టడానికి కారణం?
దర్శకుడు శ్రీ ముందుగా ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. ‘రాజా విక్రమార్క’ టైటిల్ సౌండింగ్‌లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చిరంజీవి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకొని ‘రాజా విక్రమార్క’ టైటిల్‌కు సరే అన్నాడు. సినిమాకు ఈటైటిల్ పెట్టిన తర్వాత ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాను. ఆయన ‘గుడ్ లక్’ అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకోవడం హ్యాపీగా అనిపించింది.
తమిళ సినిమా ‘వాలిమై’లో విలన్‌గా చేస్తున్నారు… హీరో అజిత్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
ఈ సినిమా ఫస్ట్ డే అజిత్‌తో నా కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ సెకండ్ డే అజిత్‌తో కలిసి సీన్స్ తీశారు. ఆయనను కలిసే ముందు వరకూ కొంచెం టెన్షన్ ఉండేది. ఆయన పెద్ద స్టార్. ఎలా ఉండాలో, ఏంటో? అని. ఆయనను కలిసిన ఒక నిమిషంలో చాలా కంఫర్టబుల్‌గా ఉండొచ్చని తెలిసిపోయింది. తాను స్టార్ అన్నట్టు అజిత్ ప్రవర్తించరు. దాంతో నేను ఈజీగా నటించా. ‘వాలిమై’లో నటించడం వల్ల కోలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?
యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ అనే అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయింది. ఇవన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. ఇక ‘వాలిమై’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

Hero Karthikeya interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News