Saturday, November 23, 2024

మలాల పెళ్లి జరిగింది!

- Advertisement -
- Advertisement -

Malala
లండన్: పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ శాంతి విజేత మలాల యూసఫ్‌జాయ్ పెళ్లి చేసుకుంది. ఆమెకు 15 ఏళ్ల వయసప్పుడు ఆమెపై తాలిబన్లు 2012లో కాల్పులు జరిపారు. అయితే ఆమె ప్రాణంతో బతికి బయటపడింది. తర్వాత ఆమె బాలికల విద్య కోసం ప్రచారం మొదలెట్టి నోబెల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకున్నది. ఇప్పుడు ఆమె వయస్సు 24 ఏళ్లు. ఆమె బ్రిటన్‌లో నివసిస్తున్నారు. బర్మింగ్‌హమ్‌లో ఆమె పెళ్లి జరిగింది.ఆమె భర్త పేరు అస్సర్ అని తప్ప ఇతర వివరాలేవి ఆమె వెల్లడించలేదు. ఆ దంపతులు బర్మింగ్‌హమ్‌లో తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు.
“నా జీవితంలో ఇది ఎంతో విలువైన రోజు. నేను, అస్సర్ పెళ్లిచేసుకున్నాం. జీవితాంతం మేము భాగస్వాములుగా ఉంటాం” అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతేకాక నాలుగు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే మలాల తన భర్త గురించి పేరు తప్పించి ఇతర వివరాలు ఇవ్వనప్పటికీ ఆమె భర్త అస్సర్ మలిక్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ హై పర్ఫామెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని ఇంటర్నెట్ యూజర్లు గుర్తించారు. కానీ దీనిని బ్రిటన్‌లోని రాయిటర్ వార్తా సంస్థ మాత్రం ధృవీకరించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News