Saturday, November 23, 2024

మాతృ మరణాల శాతం తగ్గించాలి….

- Advertisement -
- Advertisement -

మాతృ మరణాల శాతం తగ్గించాలి: జిల్లా వైద్యాదికారులకు కలెక్టర్ శర్మన్ ఆదేశాలు

Maternal mortality should be reduced

మన తెలంగాణ,సిటీబ్యూరో: జిల్లా పరిధిలో మాతృ మరణాల శాతాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై జరిగిన సమావేశంలో డిఎంహెచ్‌ఓతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాతృ మరణాల శాతాన్ని తగ్గించేందుకు డాక్టర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలతో పాటు గర్భిణీలకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సకాలంలో వినియోగించి గర్భిణీలు ఆరోగ్యంగా ఉండి సుఖ ప్రవసం అయ్యేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేవరకు ఎదురయ్యే సమస్యల గురించి క్షేత్ర స్దాయిలో వైద్యశాఖ సిబ్బందికి అవగాహన కలిపించడంతో పాటు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలందించాలన్నారు. గర్భిణీలలో రక్త హీనత, ఐరన్‌లోపం, జన్యు లోపలను స్కానింగ్ సమతంలో గుర్తించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు తెలియపరడంతో పాటు సీనియర్ వైద్యుల సలహా మేరకు వైద్య సేవల కోసం రిఫెరల్ ఆసుపత్రికి పంపించాలన్నారు. ఆశ, ఏఎన్‌ఎంలు, గర్భిణీలకు ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తూ మందులు, పౌష్టికాహారం సరిగా తీసుకునేలా సూచనలు ఇవ్వాలని తద్వారా సమాజంలో మాతృ మరణాలను అరికట్టవచ్చని తెలిపారు.

అనంతరం జిల్లా వైద్యాదికారి డా. వెంకటి ప్రసంగిస్తూ బాలింతల మరణాల శాతాన్ని తగ్గించడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి గర్భిణీ నమోదైన నాటి నుంచి మొదలు బీపీ హిమోగ్లోబిన్ 11 ఉండేలా ఐరన్, విటమిన్ మాత్రలు, స్కానింగ్, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో అదనపు ఆరోగ్యాధికారి జయమాలిని, నిలోఫర్ ఆసుపత్రి నోడల్ అధికారి అరుణకుమారి, మెడికల్ ఆపీసర్లు, ఎఎన్‌ఎం, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News