Monday, November 18, 2024

కంగనా రనౌత్ వ్యాఖ్యలను కడిగేసిన వరుణ్ గాంధీ

- Advertisement -
- Advertisement -

Varun and Kangana
న్యూఢిల్లీ: భారత్‌కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలను పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ కడిగిపారేశారు. ఆమెది ‘పిచ్చితనం’ అనాలో లేక ‘దేశద్రోహం’ అనాలో అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రనౌత్ అన్న మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అనేకుల విమర్శలకు నెలవవుతోంది. ‘మనకు నాడు వచ్చింది స్వాతంత్య్రం కాదు కానీ ‘బిచం’, అసలు స్వాతంత్య్రం 2014లోనే వచ్చింది’ అని కంగనా రనౌత్ ఓ కార్యక్రమంలో అన్న వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
వరుణ్ గాంధీ తన ట్వీట్‌లో ‘కొన్ని సందర్భాల్లో వారు మహాత్మ గాంధీ త్యాగాన్ని, పవిత్రతను అవమానిస్తుంటారు. గాంధీని చంపిన వ్యక్తిని గౌరవిస్తుంటారు. ఇప్పుడు వారు మంగల్ పాండే, రాణి లక్ష్మీభాయ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తున్నారు. దీన్ని నేను పిచ్చితనం అనాలా లేక దేశద్రోహం అనాలా?” అన్నారు.
ఒకానొక కార్యక్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని, ఓ కళాకారిణిగా, ఓ జాతీయవాదిగా తాను భారత స్వాతంత్య్ర సమరం గురించి మాట్లాడతాను ’ అన్నారు.
ఆమె సావర్కర్ గురించి మాట్లాడుతూ , “కాంగ్రెస్ వాళ్లు ఆయనను దేశభక్తుడు కాదని ఆరోపిస్తుంటారు. ఇది చాలా పెద్ద విషయం. దీనిపై నేను చాలా అధ్యయనం చేశారు. ఓ సినిమా కూడా చేశాను. బ్రిటిష్ వాళ్లు భారత్‌ను ప్రజాస్వామికంగా ఏమీ తీసుకోలేదు. వారు దేశాన్ని బలవంతంగా తీసుకున్నారు. కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి. కానీ 1857లో ఓ నిర్ణయాత్మక యుద్ధం జరిగింది. యూదుల కన్నా ఎక్కువ ఘోరం భారతీయులపై జరిగింది. అదంతా మీడియాలో ప్రింట్ కాలేదు. జలియాన్‌వాల ఊచకోత కానివ్వండి, బెంగాల్ కరువు కానివ్వండి. వారు భారతీయులను క్షుద్భాదలకు వదిలేసి పోయారు. భారతీయులను అణచేసే శక్తి వారికున్నప్పటికీ వారు భారతీయులను కరువు కోరల్లో వదిలేసి వెళ్లిపోయారు” అని చెప్పుకొచ్చింది. కంగనా రనౌత్ ఇటీవల ఓ సినిమా కోసం అండమన్‌లోని సావర్కర్ జైలు గదిని తిలకించింది. కొంత మంది చరిత్రను తిరగరాశారు అంది. ఆమె కాంగ్రెస్‌ను విమర్శిస్తూ “ సెకులర్ అనేది ఎవరికి చెందింది కాదు. బ్రిటిష్ వాళ్లు కాంగ్రెస్ పేరిట విస్తరణ చేసి వెళ్లారు” అంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News