మన తెలంగాణ,సిటీబ్యూరో: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్దిక చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు సంబంధిత శాఖాధికారులు సంయుక్తంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేసి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలవాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని స్పష్టం చేశారు.
సంక్షేమ శాఖాధికారులు వారికి నిర్ధేశించిన బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులను తరుచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీప్ యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని, పూర్తి యూనిట్లకు యూటిలైజషన్ సర్టిపికెట్ సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకర్లు లబ్దిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైనంత మేరకు ధ్రువపత్రాలను నిర్ధేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంస్వానిధి, పిఎం ఇజిపి,ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్‌కు సంబంధించిన అన్ని పథకాలు డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎల్డిఎం రవిశంకర్ ఠాగూర్ మాట్లాడుతూ ఎంఎస్ ఈటార్గెట్ 15709. 72 కోట్లయితై 17664.31 కోటుల అంటే 112 శాతం సాధించినట్లు తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా పొటెన్షియల్ 202223కి 25413.73 కోట్లు ఉన్నట్లు నాబార్డ్ అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎంఎస్ఎం ఈ సోషల్ ఇన్ప్రాస్ట్రక్చర్ రెన్యువల్ ఎనర్జీ, ఇతర రంగాల్లో ఈపొటెన్షియల్ ఉన్నట్లు తెలిపారు. ఈసమావేశంలో ఆర్బీఐ అధికారి శివరామన్, నాబార్డ్ డిపిఓ ప్రవీణ్ ,వివిధ సంక్షేమ శాఖాధికారులు,బ్యాంకు అదికారులు తదితరులు పాల్గొన్నారు.