Friday, November 22, 2024

కన్నూర్-బెంగళూరు రైలుపై బండరాళ్లు

- Advertisement -
- Advertisement -
Train derail
coaches derail
పట్టాలు తప్పిన ఏడు రైలు భోగీలు

బెంగళూరు: పెద్ద బండరాళ్లు కొండపై నుంచి జారి కన్నూర్-బెంగళూరు రైలుపై శుక్రవారం పడ్డంతో ఏడు భోగీలు పట్టాలు తప్పాయి. తమిళనాడులోని తొప్పూరు, సివాడీ మధ్య ఉన్న ముతంపట్టీ వద్ద ఈ రైలు ప్రమాదం జరిగింది. ఆ రైలులో ప్రయాణించిన 2348 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. అలాగే ఎవరూ ప్రాణాలు కోలోలేదు. ఆ రైలు గురువారం సాయంత్రం 6.05 గంటలకు కన్నూర్ నుంచి బయలు దేరింది. కాగా శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు డిఆర్‌ఎం శ్యామ్ సింగ్ తన డివిజనల్ సీనియర్ అధికారుల బృందం, వైద్య బృందంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రైలు పై కొండమీద నుంచి జారిపడిన పెద్ద బండరాళ్లు పట్టాలు తప్పిన భోగిలను ఆనుకుని ఉన్న దృశ్యాన్ని ఫోటోలో చూడవచ్చు. బండరాళ్లను తొలగించేందుకు బుల్‌డోజర్లను ఉపయోగించారు. ప్రయాణికులను తరలించడానికి ఐదు బస్సులను ఘటనాస్థలిలో ఏర్పాటుచేశారు. అంతేకాక ప్రయాణికులకు రిఫ్రెష్‌మెంట్లు, త్రాగునీరు అందించారు. కాగా తొప్పూరు నుంచి ప్రయాణికులను తరలించడానికి మొత్తం 15 బస్సులను ఏర్పాటుచేశారు. ఈ రైలు ప్రమాదంతో బెంగళూరు-ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ స్పెషల్, నాగర్‌కోయిల్ జంక్షన్-కెఎస్‌ఆర్ బెంగళూరు ఫెస్టివల్ స్పెషల్, సేలం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైళ్లను వేరే రూట్‌కు మళ్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News