Tuesday, November 26, 2024

ఎల్2, హెచ్4 వీసా ప్రవాసులకు అమెరికా కోర్టు ఊరట

- Advertisement -
- Advertisement -

us court relief

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసుల జీవితభాగస్వాములకు పనిచేసుకునేందుకు, ఎక్కువ కాలం ఉండేందుకు వాషింగ్టన్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్‌లోని జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. 15 మంది అర్జీదారులు ఈ వ్యాజ్యాన్ని కోర్టులో వేశారు. వారిలో 13 మంది భారతీయులే. దీంతో ప్రవాసుల తాలూకు జీవితభాగస్వాములకు కొంత ఊరట లభించినట్లయింది. ఇదో పాక్షిక విజయం. వారిక వర్క్ ఆథరైజేషన్‌కు అప్లయ్ చేయనవసరంలేదు. ఎల్-1, హెచ్1బి వీసాలు కలిగిన ప్రవాసుల జీవిత భాగస్వాముల వర్క్ ఎక్స్‌టన్షన్ ఆటోమేటిక్‌గా 180 రోజులు పొడగించబడతాయి. ఈ మేరకు కోర్టు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్‌సిఐఎస్)కు ఆదేశాలిచ్చింది.

అయితే ఎల్-1, ఎల్-2 వీసా ఉన్న వారి జీవిత భాగస్వామి అప్లయ్‌చేసుకోకున్నా ఎక్స్‌టెన్షన్ లభిస్తుంది. కానీ హెచ్4వీసా ఉన్నవారి జీవితభాగస్వామి మాత్రం ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ ఎక్స్‌పైర్ అయిపోయాక ఎక్స్‌టెన్షన్‌కు అప్లయ్ చేయాల్సి ఉంటుంది. హెచ్4 వీసా హోల్డర్లు , హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వామి తమ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ నవీనికరించుకోలేకపోయినందున ఉద్యోగాలు కోల్పోతున్నారు.దాంతో భారతీయులు, లాయర్లు మార్చ్‌లో అమెరికా ప్రవాస విధానాన్ని సవాలుచేస్తూ క్లాస్ యాక్షన్ సూట్ వేశారు. వారు పాక్షికంగా విజయాన్ని సాధించగలిగారు. అయినా ఇపటికీ ప్రవాసుల వర్క్ ఆథరైజేషన్ ప్రాసెస్ సులభంగా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News