Friday, November 15, 2024

మన తెలంగాణ సీనియర్ సబ్ ఎడిటర్ కరుణాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మన తెలంగాణ దినపత్రిక సీనియర్ సబ్ ఎడిటర్ చల్లా కరుణాకర్ రెడ్డి(52) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు గంటల ప్రాంతంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరుణాకర్ రెడ్డికి భార్య నీరజ, కుమారుడు సాయి భరత్‌రెడ్డి ఉన్నారు. కరుణాకర్ రెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా. గత ఆరు సంవత్సరాలుగా ఆయన మన తెలంగాణ దినపత్రికకు సంబంధించిన వెబ్ ఎడిషన్‌లో పనిచేస్తున్నారు. సరూర్‌నగర్ ప్రాంతం మీర్‌పేట్ మండలం బాలాపూర్‌లో ఆయన నివసిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి అకాలమృతి పట్ల మన తెలంగాణ దినపత్రిక యాజమాన్యం, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News