న్యూఢిల్లీ: కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు. ఈ నడవ… ఆలయాన్ని గంగా ఘాట్‌లతో కలుపుతుందని, దీని కొలతలు 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉండగలదని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌లో మ్యూజియం, లైబ్రరీ, యాత్రికుల వసతి కేంద్రం, ముముక్ష భవన్ వంటివి ఉండనున్నాయి. కాశీ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వాసితులైన 400 కుటుంబాలతో కలిసి ప్రధాని దీనిని ప్రారంభించనున్నారని సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కారిడార్ ప్రారంభోత్సవం డిసెంబర్‌లో జరుగనుందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌కు సాంస్కృతిక, రాజకీయాల రీత్యా ప్రాధాన్యత ఉందని కూడా వారు తెలిపారు. చారిత్రకంగా చూస్తే ఇందోర్‌కు చెందిన హోల్కర్ రాణి అహల్యా బాయి హోల్కర్ గంగా ఘాట్ వరకు అనేక మందిరాలు, సుందర దృశ్యాలు(విస్టాస్) నిర్మించారు. ఉత్తర్‌ప్రదేశ్ బిజెపి సోషల్ మీడియా సెల్ అధిపతి శశి కుమార్ ‘కాశీ కారిడార్ ప్రారంభోత్సవం 12 జ్యోతిర్లింగాల(అందులో కాశీ కూడా ఒకటి) ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రధాని నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని నదుల నీటిని బాబా విశ్వనాథ్ (శివుని) మూర్తికి అభిషేకించడానికి తేనున్నారు. చారిత్రక గుడిపై ఓ సౌండ్ అండ్ లేజర్ షో కూడా నిర్వహించనున్నారు. ఇక గంగా ఘాట్లయితే దీపావళి వలే దీపాలతో అలంకరించబడతాయి” అని విలేకరికి తెలిపారు. 2018లో మోడీ రూ. 600(సుమారుగా) కోట్లుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అందులో రూ. 300 కోట్లు భూమిని, గుడి చుట్టుపక్కల ఉన్న భవనాలు వంటివి కొనడానికి, పరిహారాలు చెల్లించడానికి ఖర్చయిందని సమాచారం.
కాశీ ఆలయ కారిడార్ ప్రారంభించనున్న ప్రధాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -