Saturday, November 23, 2024

ఎల్‌ఇడి లైట్ ద్వారా కాంతిని పొందడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది….

- Advertisement -
- Advertisement -

LED light not only receives light but also kills bacteria

 

మనతెలంగాణ/మాదాపూర్ : ఎల్‌ఇడి లైట్ ద్వారా కాంతిని పొందడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపవచ్చు అని ఎల్‌ఇడి చిప్ ఇండస్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గుప్తా తెలిపారు. శుక్రవారం మాదాపూర్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పో (పిహెచ్‌ఐసి) 2021లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎల్‌ఇడి చిప్ ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గుప్తా మాట్లాడుతు దేశంలో మొదటి సారి నాన్ యువి ఎల్‌ఇడి లైట్‌తో రోగ కోరిక సూక్ష్మ క్రిములను చంపే లైట్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ లైట్ ప్రీమియర్ నేషనల్ రీసెర్చ్ ల్యాబ్ అయిన సిసిఎంబి ల్యాబ్‌లో పరీక్షించడం జరిగిందన్నారు. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హస్పిటల్‌లోని బిఎస్‌ఎల్3 ల్యాబ్‌లో ధృవీకరించబడిందన్నారు. ఈ ఎల్‌ఇడి లైట్‌తో కాంతిని పోందడమే కాకుండ బ్యాక్టీరియాను కూడ చంపవచ్చన్నారు. కేవలం ఎల్‌ఇడి కర్చుతోనే మీ ఇంటి ఇంటీరియర్‌లను జీరో ఇన్ఫెక్షన్ మీ స్వంత సృష్టించవచ్చన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ ఆగస్టు 2021లో ఈ ఉత్పత్తిని పరీక్షించడం ద్వారా 95శాతం కోవిడ్19 వైరస్‌ని 60 నిమిషల్లో తగ్గిపోయిందన్నారు. రేవ్యూర్ లైట్ (పిహెచ్‌ఐసి ఎక్స్‌పోలో ఈ ప్రోడక్ట్‌ను మార్కెట్లోకి నేడు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇతర బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవుల విషయానికొస్తే రేవ్యూర్ లైట్ 60 నిమిషాల్లో 6080శాతం సూక్ష్మజీవుల సంఖ్యను తొలగిస్తుందన్నారు. అన్ని మైక్రోమయాలజీ ల్యాబ్‌ల ద్వారా ఆన్‌సైట్‌లో సులభంగా ధృవీకరించబడిందన్నారు. ఇది మానవ అనుకులమైనదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వివిధ ప్రదేశాలలో, సమయల్లో నిర్వహించిన అనేక పరిశోధనలు యాంటీ బ్యాక్టీరియల్ బ్లూలైట్ కరోనా వైరస్‌ను చంపగలదని నిరూపించిందన్నారు.

యాంటి బాక్టీరియల్ లైట్ ఉపరితలాపై లేదా గాలిలో ప్రభావవంతంగా చంపడలదని కూడా నిర్దరించాడం జరిగిందన్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి తక్కువ హనిని కలిగిస్తుందన్నారు. క్రిమిసంహరకానికి మంచి ఎంపికగా ఉపయోగించబడుతుందన్నారు. రేవ్యూరి లైట్ ఒక స్పెక్ట్రల్ కాంపోనెంట్‌ను కలిగి ఉందన్నారు. హ్యూమన్ సేఫ్ రేవ్యూరి ఇండోర్ యాంటీ కోవిడ్ యాంటీ బాక్టీరియల్ ఉత్పత్తి ఎంఎస్ యూనివర్సిటీ ధృవీకరించినట్లుగా మానవ చర్మం, కళ్లకు సురక్షితమైందన్నారు. వివిధ పరిమాణాలలో అందుబాటులో ఉందన్నారు. ఇంటీరియల్‌లకు సరిపోయేలా అనుకూలీకరించబడిందన్నారు. ఇందులోని ఉత్పత్తి రకాలు రీసెస్ ప్యానెల్, సర్పేస్ ప్యానెల్, వాల్ లైట్, వైద్యులు, కార్పొరేట్ మేనేజర్లు తమ క్యాబిన్‌లను బహుమతిగా ఇవ్వబడవచ్చున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News