Tuesday, November 26, 2024

హిందూయిజం అంటే గూండాయిజం కాదే

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi draws distinction between Hinduism

ఖుర్షీద్ రాతల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
సేవాగ్రామ్ కార్యకర్తలకు వీడియో సందేశం
పరివార్ ప్రాబల్యం చెందిందని అంగీకారం

న్యూఢిల్లీ : హిందూత్వ, హిందూయిజం రెండువేర్వేరు అంశాలు, ఆలోచనా విధానాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన అయోధ్య పుస్తకంలో హిందూత్వ ఉగ్రవాదానికి ప్రతీక అయిందని రాయడంపై దుమారం తలెత్తింది.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించారు. హిందూత్వ వేరు , హిందూయిజం వేరు అని వ్యాఖ్యానించారు. వీటికి సంబంధించి ఉన్న భిన్నత్వాన్ని కనుగొని, అర్ధం చేసుకోవల్సి ఉందన్నారు. వార్దాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో జరిగిన సంస్థాగత శిక్షణా కార్యక్రమాన్ని ఉద్ధేశించి రాహుల్ శుక్రవారం వర్చువల్ పద్థతిలో మాట్లాడారు. హిందూయిజం, హిందూత్వ ఒక్కటే అయితే వాటికి రెండు వేర్వేరు పదాలు ఎందుకున్నాయి? రెండు ఒకే పదాలు అనుకుంటే, మరి హిందూయిజం అని చెప్పే వారు భిన్న విశ్వాసాల వారిని వేధించడమే ఆలోచనగా మల్చుకుంటే , ఇక హిందూత్వను కూడా ఈ పరిధిలోని అంశంగా తీసుకోవల్సి ఉంటుందా? అని ప్రశ్నించారు.

కొందరు ఈ భిన్న అంశాలను ఒకటి చేసి మాట్లాడుతూ తమ సొంత వైఖరిని చాటుకుంటున్నారని అన్నారు. హిందూయిజం ఇప్పుడు రాజకీయం అయ్యిందని, దీనితో ఇది ఐసిస్ లేదా బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థల మాదిరిగా మారిందని ఖుర్షీద్ తమ పుస్తకంలో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తన అభిప్రాయం మేరకు కొన్ని శక్తులు భిన్నమైన అంశాలను ఒకేగాటిన కట్టి తమ సంకుచిత వాదాన్ని సాగించుకునేలా చేసుకుంటున్నట్లుగా ఉందని రాహుల్ ఆక్షేపించారు. రెండు వేర్వేరు అంశాల భిన్నత్వాన్ని గురించి మనం తెలుసుకోవల్సి ఉంది. అంతరార్థాన్ని గ్రహించాల్సి ఉంది. ఈ అంశాలలోని వైరుద్ధాన్ని తెలుసుకునే వ్యక్తులతో కూడిన బృందాలను తయారుచేసుకోవల్సి ఉంటుందని రాహుల్ సూచించారు.

ఎదుర్కొనే బృందాలు అవసరం

రెండు వేర్వేరు అంశాలను బాగా తెలుసుకున్న వారు, తాము గ్రహించిన అంశాన్ని జరుగుతున్న పరిణామాలకు, వ్యవహారశైలికి , వివిధ రకాల చర్యలకు అన్వయింపచేసుకుని కీలక నిజాలను సమాజానికి తెలియచేయాల్సి ఉందన్నారు. హిందూయిజం అంటే సిక్కునో ముస్లింనో కొట్టడమా? దీనినే హిందూత్వ అనుకోవాలా? అని ప్రశ్నించారు. హిందూయిజం అంటే తమకు నచ్చని వారిని అంతమొందించడమా? అని ప్రశ్నించారు. తాను ఉపనిషత్తులను చదివానని , ఎక్కడ కూడా ఇందులో అమాయకులను తుదముట్టించవచ్చుననే వాదనలేదని తెలిపారు. ఖుర్షీద్ రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య పుస్తక వివాదంపై రాహుల్ సేవాగ్రామ్ శిబిరంలోని వారితో తన అభిప్రాయాలను సుదీర్ఘంగానే పంచుకున్నారు.

కాంగ్రెస్ ప్రేమభావనపై పరివార్ క్రీనీడలు

దేశంలో ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల ద్వేషపూరిత భావజాలం ప్రాబల్యం పొందుతోందని రాహుల్ తెలిపారు. ఇది క్రమేపీ కాంగ్రెస్ అంతర్లీన ప్రేమ ఔదార్యం, జాతీయతల ఆలోచనా స్రవంతిని నీడలా కమ్మేస్తోందని అంగీకరించారు. మనకు ఇది రుచించినా లేకపోయినా ఈ చేదునిజాన్ని మనమంతా అంగీకరించాల్సిందే అన్నారు. అయితే ఇక్కడో విషయం మనమంతా గ్రహించాలి, మన సిద్ధాంతం జీవకళతోనే బలీయంగానే ఉంది. అయితే దీనిపై క్రీనీడలు పర్చుకున్నాయని ఇది నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన విషయమే అయిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News