Monday, November 18, 2024

కొవిడ్‌పై కొవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం

- Advertisement -
- Advertisement -

Covaxin phase 3 data shows 77.8 percent efficacy

93.4 శాతం కొవిడ్‌నుంచి కాపాడే లక్షణాలు
0.5 శాతంకన్నా తక్కువ మందిలోనే దుష్పరిణామాలు
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించిన లాన్సెట్ జర్నల్

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశీయంగా హైరాబాద్‌కు చెందిన ఫార్మాసంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్.. కొవిడ్ తీవ్ర లక్షణాలనుంచి 93.4 శాతం కాపాడే లక్షణాలను కనబరిచిందనిప్రముఖ జర్నల్ లాన్సెట్ కథనం వెల్లడించింది. ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను జర్నల్‌లో ప్రచురించారు. ఈ కథనం ప్రకారం.. ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో 0.5 శాతంకన్నా తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రబల రూపకంగా ఉన్న డెల్టా వేరియంట్‌నుంచి 65.2 శాతం కాపాడే సామర్థ్యం కొవాగ్జిన్‌కు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడయింది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అన్ని రకాల కొవిడ్ స్ట్రెయిన్స్‌నుంచి ఈ టీకా 77.8 శాతం రక్షణ ఇస్తుంది. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల్లో దేశవ్యాప్తంగా 25 వివిధ ప్రాంతాలనుంచి మొత్తం 25,800 మంది పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్ 16నుంచి ఈ ఏడాది మే 17 మధ్య కాలంలో ఈ ట్రయల్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ కోసం భారత్‌లో జరిగిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదేనని భారత్ బయోటెక్ వెల్లడించింది.

కొవాగ్జిన్ టీకా సామర్థం, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ఫలితాలు దాదాపు 10 ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమయినట్లు భారత్ బయోటెక్ కంపెనీ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.దీంతో ప్రపంచంలో అత్యధికంగా ప్రచురితమైన టీకాల్లో ఒకటిగా కొవాగ్జిన్ నిలిచిందని ఆయన తెలిపారు. అన్ని వర్గాలనుంచి సహకారం అందడంవల్లనే ఇది సాధ్యమయిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 10 నెలల వ్యవధిలోనే ఈ ఘనత సాధించడం ఆత్మనిర్భర్ భారత్ శక్తిని తెలియజేస్తోందన్నారు. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగా టీకాల జాబితాల డబ్లు హెచ్‌ఓ ఇటీవలే చేర్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాల్లో ఈ టీకా వినియోగానికి మార్గం సుగమం అయింది. అంతకు ముందే ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ టీకా వినియోగానికి ఆయా ఔఫధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News