- Advertisement -
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గ్యారపట్టి ఎన్‌కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది. గ్యారపట్టి ఎన్‌కౌంటర్ బూటకమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. పోలీసులే ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని, అమాయక ప్రజలకు డబ్బులు ఆశచూపి మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్నారని పేర్కొంది. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, తెలంగాణ మూడు రాష్ట్రాల సమన్వయంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని, ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. కాగా, గడ్చిరోలి జిల్లా దట్టమైన అడవులలో శనివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 26మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.
Maoist Party React on Gadchiroli Encounter
- Advertisement -