Friday, November 15, 2024

రేపు తొలి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

MP station
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆరంభించనున్నారు. ఒకప్పుడు హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ అని పిలువబడే రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించి ప్రపంచ ప్రమాణాల స్థాయికి మెరుగుపరిచారు. అంతేకాక ఆ స్టేషన్‌కు గోండ్ రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా పేరు మార్చారు. ఈ కొత్త రైల్వే స్టేషన్‌లో విమానాశ్రయంలో ఉండేంటటువంటి మెరుగైన వసతులు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు రూ. 450 కోట్లు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కింద మూడేళ్లలో ఖర్చు చేశారు. వికలాంగులు సైతం సులభంగా వెళ్లగలిగేలా సదుపాయాలు ఏర్పాటుచేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ స్టేషన్‌కు రాణి కమలాపతి అన్న కొత్త పేరును నామకరణం చేశారు. ఆఫ్ఘన్ కమాండర్ దోస్త్ మొహమ్మద్ మోసంతో ఆమె రాజ్యాన్ని కబళించినప్పుడు, ఆమె తన గౌరవాన్ని కాపాడుకోడానికి ‘జల్ జౌమర్’(ఆత్మహత్య) చేసుకుని ప్రాణ త్యాగం చేసింది. ఆ రాణి పేరునే ఈ స్టేషన్‌కు కొత్త నామకరణం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News