Tuesday, November 5, 2024

క్రెడిట్ కార్డుల ఛీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Defendant arrested in credit card fraud case
పరారీలో మరో నిందితుడు

హైదరాబాద్: క్రెడిట్ కార్డు బోనస్ పాయింట్ల పేరుతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….. ఢిల్లీలోని సాగర్‌పూర్, వెస్ట్‌సాగర్‌పూర్‌కు చెందిన దీపక్ కుమార్, ముఖేష్ కలిసి సులభంగా డబ్బులు సంపాధించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డుల పాయింట్లను రెడీమ్ చేసుకునేందుకు అని చెప్పి క్రెడిట్ కార్డులు ఉన్న వారి వివరాలు తెలుసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డుదారుల డాటాను సేకరించారు. ఏజెంట్ల ద్వారా సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వాటి ఆధారంగా క్రెడిట్ కార్డుదారులకు ఫోన్లు చేసి తాము క్రెడిట్ కార్డు డిపార్ట్‌మెంట్ నుంచి ఎగ్జిక్యూటీవ్స్‌ము మాట్లాడుతున్నామని చెప్పేవారు.

బోనస్ పాయింట్లను రిడీమ్ చేసుకుంనేదుకు బాధితుల నుంచి కార్డు నంబర్, సివివి, ఓటిపి తదితర వివరాలు తెలుసుకునేవారు. వాటి ఆధారంగా కారు ఆన్‌లైన్‌లో ఈ వాలెట్లు, బ్యాంక్ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని సహారా ఎస్టేట్‌కు చెందిన దీపక్‌కుమార్ అనే వ్యక్తికి చెందిన క్రెడిట్ కార్డు వివరాలు మొత్తం తెలుసుకున్నారు. రివార్డులు రెడీమ్ కావలంటే ఓటిపి చెప్పాలని అనడంతో బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్స్ కావచ్చని వారికి ఓటిపి చెప్పాడు. దీంతో బాధితులు రూ.93,772 వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. వచ్చిన డబ్బులను నిందితులు విలాసాలకు ఖర్చు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News