Saturday, November 23, 2024

కేరళలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు …

- Advertisement -
- Advertisement -

Uninterrupted heavy rains in Kerala

పొంగిప్రవహిస్తున్న నదులు, ఆనకట్టలు
శబరిమలై భక్తులను పరిమితం చేయాలని నిర్ణయం
ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్‌లో రెడ్‌అలెర్ట్

ఇడుక్కి (కేరళ) : కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సెంట్రల్ కేరళ లోని ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో ఆదివారం వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రం లోని ఆనకట్టల్లో వరద నీటి మట్టం ప్రమాదస్థాయిని మించి పోయింది. ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన చెరుథొని ఆనకట్ట తలుపుల్లో ఒకదాన్ని తెరవడానికి ప్రభుత్వాధికారులు ఆదివారం ప్రయత్నించారు. ఈ ఆనకట్ట లో నీటి మట్టం మధ్యాహ్నానికి 2398.94 అడుగులకు వరదనీరు పెరగడంతో మూడో తలుపును మధ్యాహ్నం 3 గంటల తరువాత 40 సెంటీమీటర్ల పైకి లేవనెత్తారు. పెరియార్ తదితర నదుల్లోను వరద ప్రవాహం పెరుగుతోంది. దక్షిణ కేరళలో అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి.

పథనందిట్ట జిల్లాలో భారీ వర్షాలకు నదీతీర ప్రాంతాల్లోను, కొండచరియల ప్రాంతాల్లోను ప్రజలను అప్రమత్తం చేశారు. తిరువనంతపురంలో భారీవర్షాలు కురుస్తుండగా, కొట్టాయం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలో జరిగిన అధికారుల సమావేశం నిర్ణయించింది. కొండచరియలు, ఇతర ప్రమాదాలు పొంచి ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News